World's Longest Sea Crossing Bridge Wiki In Telugu Hongkong -Macau-Zhuhai సముద్రపు వంతెన విశేషాలు

ప్రపంచంలోకెల్లా పొడువైన   Hongkong -Macau-Zhuhai సముద్రపు వంతెన విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.

నిర్మించడం ప్రారంభించిన తొమ్మిది సంవత్సరాల తర్వాత చైనా ప్రెసిడెంట్ Xi Jinping ఈ ప్రపంచంలోకెల్లా పొడువైన సముద్రపు వంతెనను జాతికి అంకితం చేశారు.

CREDIT www.bbc.com

world's longest sea crossing bridge గా ఇది ప్రసిద్ది చెందింది.

ఈ బ్రిడ్జి హాంగ్ కాంగ్ ను మరియు చైనా సిటీ జుహై ను కలుపుతుంది.

ఈ బ్రిడ్జి మొత్తం పొడువు 55km లేదా 34 మైళ్ళు.

మొదలుపెట్టినప్పటి నుండి పూర్తయ్యేలోపు లెక్కలేనన్ని సార్లు వాయిదాపడ్డ ఈ బ్రిడ్జి నిర్మాణానికి మొత్తం అయిన కర్చు $20bn (£15.3bn).అంటే మన కరెన్సీ లో దాదాపు 2000కోట్ల డాలర్లు.అంటే 1,46,98,00,00,00,000 రూపాయలు.

official  గా మొత్తం 18 మంది వర్కర్లు ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేలోపు మరణించారు.

బుధవారం అంటే అక్టోబర్ 24 నుండి ఈ వంతెన పై నుండి ట్రాఫ్ఫిక్ ను అనుమతిస్తారు.

ఈ బ్రిడ్జి దక్షిణ చైనా లోని మొత్తం మూడు కోస్టల్ సిటీస్ హంగ్ కాంగ్ ,మేకావో ,జుహై లను కలుపుతుంది.

ఈ వంతెన నిర్మాణానికి మొత్తం 400,000 టన్నుల స్టీల్ ను వాడినట్లు అంచనా.

ఈ వంతెనకు వాడిన స్టీల్ తో దాదాపు 60 ఈఫిల్ టవర్లు నిర్మించవచ్చట.

పడవల ప్రయాణానికి అనుగుణంగా దాదాపు 6.7 km కు పైగా ఈ వంతెన సముద్రపులోపల టన్నెల్ లో సాగుతుంది.కృత్రిమంగా నిర్మించబడ్డ రెండు ద్వీపాల మద్య ఈ టన్నెల్ నిర్మితమైంది.

 హాంగ్ కాంగ్ నుండి జుహై కు ఇంతకుముందు నాలుగు గంటల సమయం తీసుకునేది ఇప్పుడది 30 నిమిషాలకి తగ్గించబడింది.

video credit BBC NEWS





ఈ  ఆర్టికల్  నచ్చితే దయచేసి మీ మిత్రులకు షేర్ చెయ్యండి.

Post a Comment

0 Comments